ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రేరణగా నిలిచిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన త్యాగస్ఫూర్తి, పోరాట పటిమ నేటి తరాలకు ఆదర్శమని అన్నారు. విప్లవ పోరాటాల పితామహుడిగా దొడ్డి కొమరయ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, సహాయ కార్యదర్శి గడ్డం పాండురంగం, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి మహేష్ యాదవ్, ఫోరమ్ సభ్యులు శంకరి శ్రీకాంత్ రెడ్డి, అన్వార్ తదితరులు పాల్గొన్నారు
Admin
ప్రజా పిలుపు