Saturday, 26 September 2026 12:25:22 PM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: కోల్కూరి నరసింహారెడ్డి

Date : 28 June 2026 11:41 AM Views : 65

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఏఐసీసీ పిలుపు మేరకు నీట్-2026 పరీక్ష పేపర్ లీక్ ఘటనపై నిరసనగా ఆదివారం పటాన్‌చెరు పట్టణ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించినట్లు సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ, పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోల్కూరి నరసింహారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీట్-2026 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం వల్ల పరీక్ష రద్దు కావడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని ఆరోపించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.గత మూడు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ ఘటనల కారణంగా కోట్లాది మంది విద్యార్థులు అయోమయం, ఆందోళనకు గురయ్యారని ఆయన ఆరోపించారు. అలాగే, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు రైతులు, కార్మికులు,యువతకునష్టాన్నికలిగిస్తున్నాయని ఆయన విమర్శించారు.ఈ నిరసన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, సాయిలు ముదిరాజ్, అక్షిత్, శ్రీనివాస్, ఐఎన్‌టీయూసీ కార్మిక నాయకులు రతన్‌సింగ్, మల్లేష్, అంజయ్య, రాజుసింగ్, వినోద్, రాములు, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :