Saturday, 26 September 2026 04:54:36 PM
# బాల్య వివాహాల నిర్మూలనకు మత పెద్దలు సహకరించాలి...బాల్య వివాహాలు నిర్వహించే మత పెద్దలపై చట్టపరమైన చర్యలు # చిట్కుల్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు # చాకలి ఐలమ్మ జయంతిలో పాల్గొన్న ఫోరమ్ నాయకులు # సీఐటీయూ వట్టిపల్లి మండల కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ # తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటన పోరాటానికి స్ఫూర్తి..బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరనారి.. సమానత్వానికి ప్రతీక ఐలమ్మ # వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం # అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు

బాల్య వివాహాల నిర్మూలనకు మత పెద్దలు సహకరించాలి...బాల్య వివాహాలు నిర్వహించే మత పెద్దలపై చట్టపరమైన చర్యలు

బాల్య వివాహ రహిత జిల్లాగా సంగారెడ్డి .. జిల్లా సంక్షేమ అధికారిణి లలిత కుమారి* .

Date : 26 September 2026 04:14 PM Views : 2

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * బాల్య వివాహాల నిర్మూలనకు మత పెద్దలు తమవంతు సహకారం అందించాలని జిల్లా సంక్షేమ అధికారిణి లలిత కుమారి కోరారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, స్కోప్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణంలో బాల్య వివాహంతో బతుకు ఆగం–బాల్య వివాహ నిషేధ చట్టం-2006 అంశంపై శనివారం జిల్లాలోని పూజారులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ, 18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహాలు నిర్వహిస్తే సంబంధిత మత పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివాహాలు నిర్వహించే సమయంలో వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు జరిపించాలని మత పెద్దలకు సూచించారు.అన్ని మతాల మత పెద్దల సహకారంతో సంగారెడ్డి జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ రాజా రెడ్డి మాట్లాడుతూ .. బాల్య వివాహాలను నిర్మూలించేందుకు అన్ని శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, మత పెద్దలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.డీసీఆర్‌బీ సీఐ రమేష్ మాట్లాడుతూ .. బాల్య వివాహాలకు పాల్పడితే చట్టపరంగా శిక్షలు ఉంటాయని, రూ.1 లక్ష వరకు జరిమానా, రెండేళ్ల వరకు కారాగార శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీవో) రత్నం మాట్లాడుతూ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. బాల్య వివాహాల నివారణలో మత పెద్దల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు. స్కోప్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ శ్రీ ఉప్పలయ్య మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన కోసం తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు వెంకటేశం, విష్ణుమూర్తి, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ యాదగిరి, డీసీపీయూ సిబ్బంది లింగం, జిల్లాలోని సుమారు 100 మంది మత పెద్దలు, సిబ్బంది పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :