ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఇస్నాపూర్‌లో ఓ వివాహిత అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. ఇస్నాపూర్‌లోని ఓడీఎఫ్ కాలనీకి చెందిన మస్కీ రాంజేష్ బాబు భార్య పూర్ణిమ గణేష్ శ్రంగాలే (21) ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 19న ఉదయం సుమారు 10:30 గంటలకు రాంజేష్ బాబు పనికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో పూర్ణిమతో పాటు ఆమె భర్త చెల్లెలు, అత్త ఉన్నారు. సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో పూర్ణిమ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు.ఇంటి నుంచి వెళ్లే సమయంలో పూర్ణిమ నీలం రంగు చుడీదార్, తెలుపు రంగు దుపట్టా ధరించి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఛాయ చామనఛాయగా, ఎత్తు సుమారు ఐదు అడుగులు ఉంటుందని పేర్కొన్నారు. పూర్ణిమ ఆచూకీ తెలిసిన వారు కుటుంబ సభ్యులకు లేదా సమీప పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.
Admin
ప్రజా పిలుపు