ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం గ్రామానికి వెళ్లే రహదారి బురదమయంగా మారింది. గత రాత్రి కురిసిన వర్షానికి రోడ్డుపై ఉన్న గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారిపై నీరు నిలవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Admin
ప్రజా పిలుపు