ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నూతన దేవాలయాల అభివృద్ధి, నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం బీరంగూడ డివిజన్ పరిధిలోని లక్ష్మీ సాయి మెడోస్ కాలనీలోని పోచమ్మ దేవాలయం, ఎన్‌ఎస్‌ఎల్ కాలనీలోని వినాయక దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, భగవంతుని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ప్రమోద్ రెడ్డి, లింగం గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు