ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : నర్సాపూర్,): విజయానికి ప్రతీకగా, చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా నిలిచే విజయదశమి దసరా పండుగను పురస్కరించుకుని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును, అలాగే మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.పండుగను పురస్కరించుకుని నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దసరా పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు ఆత్మీయతను చాటిచెబుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Admin
ప్రజా పిలుపు