Friday, 25 September 2026 07:22:26 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

సీసీ ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన సీఐ లాలూ నాయక్

Date : 08 September 2026 12:41 PM Views : 118

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో విద్యార్థుల వినతిపత్రం.. జీవో 97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి (యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ)లో విలీనం చేయవద్దని డిమాండ్ చేస్తూ పటాన్‌చెరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.ఈ మేరకు పాలిటెక్నిక్ విద్యార్థులు పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో ఆర్సీపురం సీఐ లాలూ నాయక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాస్తారోకో సందర్భంగా కొంతమంది పోలీసులు సివిల్ డ్రస్సులో విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారని, తమపై అనవసరంగా దాడికి పాల్పడిన పోలీసులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని వారు సీఐని కోరారు.విద్యార్థులు సమర్పించిన వినతిపత్రాన్ని సీఐ లాలూ నాయక్ స్వీకరించారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి, లాఠీచార్జ్‌కు పాల్పడిన పోలీసులను గుర్తిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. సీసీ ఫుటేజ్‌ను ఆధారంగా చేసుకుని బాధ్యులైన వారిపై నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా, జీవో 97 రద్దు చేయాలని, పాలిటెక్నిక్‌ను శక్తిలో విలీనం చేయవద్దని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పటాన్‌చెరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థుల ఆందోళనతో పటాన్‌చెరు నుంచి ఇస్నాపూర్ వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేసేందుకు ప్రయత్నించారు. ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న లాఠీచార్జ్‌పై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.సీఐ లాలూ నాయక్ ఇచ్చిన హామీతో విద్యార్థులు తమ వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించిన అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :