Saturday, 26 September 2026 12:25:01 PM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్

Date : 28 June 2026 01:55 PM Views : 81

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్ చేరు పట్టణంలోని పాత జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎం.డీ.ఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కలిసి చిన్నారులకు పోలియోp చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణంలో పల్స్ పోలియో కార్యక్రమం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.పటాన్చెరు నియోజకవర్గంలోని చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్నారుల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి పోలియో చుక్కలు వేయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :