Friday, 25 September 2026 10:00:40 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం*

Date : 24 September 2026 07:30 PM Views : 9

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం సంగారెడ్డి జిల్లా సైన్స్ కేంద్రంలో ప్రశాంతమైన, స్నేహపూర్వక వాతావరణంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికలకు స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ జాన్ శామ్యూల్, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ వెంకటేశ్వర్లు పరిశీలకులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభ సమావేశంలో స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లను ఉద్దేశించి జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం పెంపొందడంతో పాటు జీవన నైపుణ్యాలు మెరుగుపడతాయని అన్నారు. పోలీస్ శిక్షణలో నిర్వహించే కవాతు, శిక్షణా కార్యక్రమాల తరహాలోనే స్కౌట్స్ అండ్ గైడ్స్‌లోనూ క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, సేవా దృక్పథానికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.గత సంవత్సరం నిర్వహించిన క్యాంపును ముందస్తు ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించినందుకు క్యాంప్ నిర్వహణ బృందాన్ని అదనపు ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ జాన్ శామ్యూల్ మాట్లాడుతూ, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా క్యాంపులను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.అనంతరం అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో జరగగా, సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.నూతన జిల్లా కార్యవర్గం జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు:గౌరవ జిల్లా కలెక్టర్ జిల్లా చీఫ్ కమిషనర్ ,జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యక్షులుగా ,జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి,జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి,జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ ,జిల్లా పౌర సంబంధాల అధికారి విజయలక్ష్మి,జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీనివాస్ ,జిల్లా పశువైద్యాధికారి వసంత కుమారి జిల్లా కమీషనర్లుగా అంజ గౌడ్, ఎలిజబెత్ జిల్లా సెక్రటరీ గా మాధవ రెడ్డి,జిల్లా కోశాధికారి గా జీ.సుందర్ రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి గా శోభ,జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ లుగా ఆంజనేయులు, వందనట్రైనింగ్ కమిషనర్లుగా చంద్రశేఖర్ గౌడ్ ,సుజాత అసిస్టెంట్ స్టేట్ హెడ్ క్వార్టర్ బాధ్యులుగా వీరేశం,స్వప్నశ్రీ తదితరులు ఎన్నికైనట్లు తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :