ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిల్లావ్యాప్తంగా వినాయక శోభాయాత్రలు, నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ తెలిపారు.శనివారం హత్నూర మండలంలోని దౌల్తాబాద్, బోరపట్ల గ్రామాల్లో నిమజ్జనాలు నిర్వహించనున్న చెరువులను ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్, క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.గణేష్ శోభాయాత్రలు జరిగే మార్గాల్లో రోడ్ల పరిస్థితి, అవసరమైన మరమ్మతులు, చెరువుల వద్ద బారికేడింగ్, భద్రతా లైటింగ్, పారిశుద్ధ్య ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.ఎస్పీ వెంట హత్నూర ఎంఆర్ఓ షేక్ పర్వీన్, జిన్నారం ఇన్‌స్పెక్టర్ రమణారెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు