Friday, 25 September 2026 10:16:42 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

విరాహత్ ఆలిని మర్యాదపూర్వకంగా కలిసిన పటాన్చెరు నూతన కార్యవర్గం*

త్వరలో పటాన్‌చెరులో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిద్దాం: కే. విరహత్ అలీ*

Date : 13 August 2026 06:27 PM Views : 125

ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : టీయూడబ్ల్యూజే-ఐజేయూ పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కే. విరహత్ అలీని గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని యూనియన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి .సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్ . అధ్యక్షతన, పటాన్‌చెరు నియోజకవర్గ అధ్యక్షుడు పత్తి నరసింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కే. విరహత్ అలీ మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన జర్నలిస్టుల సమావేశం కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమై రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ప్రశంసించారు. సంఘం పట్ల జర్నలిస్టుల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా కార్యవర్గం పనిచేసిందని కొనియాడారు. టీయూడబ్ల్యూజే-ఐజేయూ సంఘానికి 75 ఏళ్ల ఘన చరిత్ర ఉందని పేర్కొన్న ఆయన, క్రమశిక్షణకు మారుపేరైన ఈ సంఘంలో ప్రతి జర్నలిస్టు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పదవి అనేది అధికారం కాదని, అది ఒక బాధ్యత మాత్రమేనని అన్నారు. అహంకారానికి దూరంగా ఉండి సేవాభావంతో పనిచేసినప్పుడే పదవికి గౌరవం లభిస్తుందని తెలిపారు.త్వరలో రాష్ట్రస్థాయి సమావేశాన్ని పటాన్‌చెరులో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అందుకు స్థానిక కార్యవర్గం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పటాన్‌చెరుకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆ ప్రాంతం ప్రత్యేక అనుభూతి కలిగి ఉందని, ఆ ప్రాముఖ్యతను మరింత పెంచేలా నూతన కార్యవర్గం పనిచేయాలని సూచించారు. సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు.యూనియన్ కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తను నాయకత్వం గుర్తిస్తుందని, వారి సేవలను ఎల్లప్పుడూ గౌరవిస్తుందని విరహత్ అలీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్, రాష్ట్ర కమిటీ నాయకులు అబ్దుల్ బాసిత్, జిల్లా ఉపాధ్యక్షుడు పర్చ శ్రీనాథ్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యాదగిరి, ఉపాధ్యక్షులు శివకుమార్, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు శేఖర్, పురుషోత్తం, శ్రీనివాస్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :