Monday, 09 November 2026 03:09:29 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అరెస్ట్

నల్ల షర్ట్‌తో అసెంబ్లీలోకి వెళ్లడంపై పోలీసుల అభ్యంతరం

Date : 07 September 2026 01:35 PM Views : 80

ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : .. హైదరాబాద్: అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్ల షర్ట్ ధరించి అసెంబ్లీలోకి రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రజాస్వామ్యబద్ధంగా నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్తున్న తనను అడ్డుకోవడంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసులు బీఆర్‌ఎస్ శాసనసభ్యుల పట్ల పాశవికంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్తే తప్పేంటని ఎమ్మెల్యే జీఎంఆర్ పోలీసులను ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును అడ్డుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :