ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జూన్ 26: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని బీరంగూడ డివిజన్ పరిధిలో ఉన్న ప్రముఖ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయాన్ని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీ అధ్యక్షురాలు & టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించారు.పూజా కార్యక్రమం అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య వారికి ఆశీర్వచనాలు అందజేసి, తీర్థప్రసాదాలు అందించి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు