Thursday, 24 September 2026 12:12:01 PM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

ప్రతి ఆటో కార్మికుడికి ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం వెంటనే అందించాలని డిమాండ్

కాంగ్రెస్ మోసపూరిత 420 హామీలపై ఆటో కార్మికుల సమర శంఖం

Date : 06 September 2026 01:48 PM Views : 58

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రామచంద్రాపురం/పటాన్‌చెరు, సెప్టెంబర్ 6: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పోరుబాటలో భాగంగా పటాన్‌చెరు నియోజకవర్గ ఆటో కార్మికులు ఆదివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీకి వేలాది మంది ఆటో కార్మికులు, భారీ సంఖ్యలో ఆటోలతో తరలివచ్చారు. దీంతో బీహెచ్‌ఈఎల్‌ నుంచి ఇస్నాపూర్‌ వరకు ప్రధాన రహదారి ఆటోలతో కిక్కిరిసిపోయింది.బీహెచ్‌ఈఎల్‌ చౌరస్తా నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ అశోక్‌నగర్, బీరంగూడ, రామచంద్రాపురం, పటాన్‌చెరు, ముత్తంగి మీదుగా ఇస్నాపూర్‌ వరకు సాగింది. ర్యాలీ పొడవునా ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఆటో కార్మికుడికి సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయాన్ని వెంటనే అందించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని హామీని ప్రకటించిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన అనంతరం దాని అమలును విస్మరించడం అన్యాయమని ఆయన విమర్శించారు.రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులు, కుటుంబ పోషణ భారంతో ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసి ఆటో కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని తెలిపారు. అవసరమైతే ఆటో కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం మరిన్ని ఉద్యమాలు చేపడతామని నాయకులు పేర్కొన్నారు.భారీ సంఖ్యలో ఆటోలతో సాగిన ర్యాలీతో పటాన్‌చెరు నియోజకవర్గంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆటో కార్మికుల ఐక్యతను చాటుతూ నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఆటో యూనియన్ ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, వేలాది మంది ఆటో కార్మికులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :