Tuesday, 10 November 2026 03:57:21 PM
# యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న* # భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు # సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం.. రైతుల్లో భయాందోళన # పేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60 వేల ఆర్థిక సహాయం # గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని బీజేపీ నాయకుల ధర్నా* # పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి

జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం

సీనియర్ జర్నలిస్టులు రామారావు అశ్వక్,రమేష్, రాజశేఖర్ ఆధ్వర్యంలో అభినందన సభ

Date : 13 July 2026 06:24 PM Views : 157

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా నూతన కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులకు పటాన్ చెరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో సోమవారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టులు రామారావు, ఆశ్వక్, రమేష్, రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి,మాజీ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు అబ్దుల్ బాసిత్, జిల్లా జనరల్ సెక్రెటరీ అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు పర్చ శ్రీనాథ్, జిల్లా సంయుక్త కార్యదర్శి కే శ్రీనివాస్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా జనరల్ సెక్రెటరీ బసవేశ్వర్, జిల్లా సంయుక్త కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఈసీ సభ్యులు సయ్యద్ మజీద్ అలీ, మైకోటి శ్రీనివాస్ లను నూతన కమిటీ సభ్యులను అభినందించారు. సంఘం బలోపేతానికి అంకితభావంతో పనిచేసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ... ప్రతి సమస్యలను పరిష్కరించే దిశగా సంఘం పనిచేస్తుందన్నారు. అక్కడేషన్ ఇళ్ల స్థలాల హెల్త్ కార్డుల సంబంధించినటువంటి అన్నిటి పైన ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా రాష్ట్ర అధ్యక్షుడు విరాత్ అలీ నోటీసుతో మనందరి సమస్యలపై తెలియపరుస్తానన్నారు.జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తమపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వంతో పాటు సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, వృత్తి హక్కుల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తామని చెప్పారు. ప్రతి జర్నలిస్టుకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సభ్యుల సహకారంతో సంగారెడ్డి జిల్లా కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శ కమిటీగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని పేర్కొన్నారు.సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సీనియర్ జర్నలిస్టుల రామారావు, రమేష్, అశ్వక్, రాజశేఖర్ లు సంఘ సభ్యులందరికీ సన్మానితులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు, సభ్యులు, స్థానిక జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :