ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బీరంగూడ గుట్టపై కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలోని శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి భక్తులు మూడు తులాల బంగారు నెక్లెస్‌ను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. రెయిన్బో మెడోస్, బీరంగూడకు చెందిన వి. శ్రీధర్ కుమార్ కుటుంబ సభ్యులు ఈ బంగారు నెక్లెస్‌ను అమ్మవారికి కానుకగా అందజేశారు.ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ అధికారుల సమక్షంలో శ్రీధర్ కుమార్ కుటుంబ సభ్యులు మూడు తులాల బంగారు నెక్లెస్‌ను ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్‌కు అందజేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నెక్లెస్‌ను అమ్మవారి అలంకరణ కోసం ఆలయానికి సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక భావనలకు ఇలాంటి కానుకలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు