ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చేరు: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పటాన్చేరు జేపీ కాలనీ డివిజన్ బండ్లగూడలో విషాద ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో బాల్ ఇంటి పైకప్పుపై పడటంతో దానిని తీసుకునేందుకు వెళ్లిన గౌతమ్ (18) అనే యువకుడు హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడు గౌతమ్ బీహార్ రాష్ట్రానికి చెందిన యువకుడిగా గుర్తించారు. బాల్ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. చిన్న వయసులోనే యువకుడు మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Admin
ప్రజా పిలుపు