ప్రజా పిలుపు / తెలంగాణ / ఖమ్మం : పెంపుడు కుక్క మూత్ర విసర్జన విషయంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ఖమ్మం నగరంలోని రంగనాయకుల గుట్టలో గురువారం అర్ధరాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.రంగనాయకుల గుట్టలో నివాసం ఉంటూ డెకరేషన్ పనులు చేస్తున్న ఉండేటి శ్రీనాథ్ (23) గురువారం అర్ధరాత్రి తన స్నేహితుడు వీరేశ్‌తో కలిసి ఆటోలో కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో స్థానిక యువకుడు వేముల మధు తన పెంపుడు కుక్కను బయటకు తీసుకురాగా, అది శ్రీనాథ్ కూర్చున్న ఆటో వద్ద మూత్ర విసర్జన చేసింది.ఈ విషయమై శ్రీనాథ్, మధు మధ్య గొడవ జరిగింది. వివాదం తీవ్రం కావడంతో మధు ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి శ్రీనాథ్‌పై దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన శ్రీనాథ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఘటనపై ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
ప్రజా పిలుపు