Monday, 10 August 2026 10:49:04 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

షాద్‌నగర్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం

*83.73 శాతం ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తి.. ఇంకా 16,661 మంది వివరాలు పెండింగ్

Date : 29 July 2026 09:53 PM Views : 32

ప్రజా పిలుపు / తెలంగాణ / రంగారెడ్డి : షాద్‌నగర్ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.జూలై 29 మధ్యాహ్నం 12 గంటల వరకు అందిన సహాయ ఎన్నికల నమోదు అధికారుల నివేదిక ప్రకారం నియోజకవర్గంలోని మొత్తం 2,44,426 మంది ఓటర్లలో 2,04,662 మంది వివరాలు డిజిటలైజ్ అయ్యాయి.దీంతో డిజిటలైజేషన్ ప్రక్రియ 83.73 శాతం పూర్తయింది.మండలాల వారీగా పరిశీలిస్తే కొందుర్గులో 91.22 శాతం, కేశంపేటలో 90.15 శాతం, జిల్లేడ్-చౌదరిగూడలో 89.76 శాతం, ఫరూక్‌నగర్ గ్రామీణ మండలంలో 88.29 శాతం, కొత్తూరులో 88.15 శాతం, నందిగామలో 86.69 శాతం మేర డిజిటలైజేషన్ పూర్తైంది. అయితే షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 65.13 శాతం మాత్రమే పూర్తవడంతో అక్కడ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.నియోజకవర్గవ్యాప్తంగా ఓటర్ల నమోదు ప్రక్రియ 93.18 శాతం మేర పురోగతి సాధించగా, ఇంకా 16,661 మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పెండింగ్‌లో ఉంది. వీరిలో అత్యధికంగా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 10,847 మంది, ఫరూక్‌నగర్ గ్రామీణ మండలంలో 2,148 మంది, నందిగామలో 1,567 మంది, కొత్తూరులో 1,086 మంది ఓటర్ల వివరాలు నమోదు కావాల్సి ఉంది.ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ఓటర్ల వివరాల నమోదు,డిజిటలైజేషన్ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని షాద్‌నగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి సరిత విజ్ఞప్తి చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :