ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జూన్ 26 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో మొహరం వేడుకలు శుక్రవారం కులమతాలకు అతీతంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పర సోదరభావాన్ని చాటుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు.మొహరం వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరిగేలా పటాన్చెరు పట్టణ సీఐ వినాయక్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక ఎస్సైలు, పోలీసు అధికారులు, సిబ్బంది వేడుకలు జరిగిన ప్రాంతాల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలకు అవసరమైన సూచనలు అందించారు. మొహరం పండుగ వేడుకల సందర్భంగా ఆలమ్ ఊరేగింపులు భక్తిశ్రద్ధలతో కొనసాగగా, ప్రజలు స్వచ్ఛందంగా పోలీసులకు సహకరించారు. పోలీసుల అప్రమత్తత, ప్రజల సహకారంతో వేడుకలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయి.
Admin
ప్రజా పిలుపు