ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ముత్తంగి డివిజన్, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని సరిహద్దు కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న మురికి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం సాయంత్రం ఇస్నాపూర్ మున్సిపల్, ముత్తంగి డివిజన్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో కలిసి కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముత్తంగి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల నుండి వచ్చే మురుగు నీటిని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని యుజిడిల ద్వారా తరలించాల్సి వస్తోందని తెలిపారు.యుజిడిల పైపు సామర్థ్యం తక్కువ ఉండడం మూలంగా నిరంతరం సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ఆయా శాఖల అధికారులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు.రెండు శాఖల అధికారులు సమన్వయంతో జనాభాకు అనుగుణంగా నూతన అంతర్గత మురుగు నీటి కాలువల పైపులైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి అతి త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్ రావు, డిఈలు కృష్ణవేణి, నరసింహ రావు, మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, కౌన్సిలర్లు ఆంజనేయులు, వెంకటేష్, మేరాజ్ ఖాన్, నిజాముద్దీన్ బాబా, అబిద్, కాలనీల ప్రజలు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు