Saturday, 26 September 2026 11:24:42 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

దివ్యశ్రీ కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మరమ్మతు పనులకు శ్రీకారం

Date : 05 July 2026 08:29 PM Views : 105

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని దివ్యశ్రీ కాలనీలో కాలనీవాసులు సొంత నిధులతో చేపడుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మరమ్మతు పనులను అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీవాసులు తమ సమస్యల పరిష్కారం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సొంత నిధులతో డ్రైనేజీ మరమ్మతు పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతి కాలనీలో నివాసితులు ఐక్యంగా ఉండి, కాలనీ నిధులను అదే కాలనీ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు వినియోగించేలా చర్యలు తీసుకుంటే భావితరాలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.కాలనీ అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ఇలాంటి కార్యక్రమాలు ఇతర కాలనీలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వసూలు , లక్ష్మీ కత్, చుక్క రెడ్డి, రామ్ చేద్రా రెడ్డి, కృష్ణ యాదవ్, శ్రీధర్, మస్తాన్, రాము, సురేష్ నాయక్, కాలనీ అధ్యక్షులు సుఖేష్, కాలనీ పాలకవర్గం సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :