ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం ఆధ్వర్యంలో, పాలకమండలి సభ్యుల సహకారంతో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపూరి శివానందం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ పాలకమండలి సభ్యులు, మార్కెట్ కార్యాలయ సిబ్బంది, వ్యాపారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు