Thursday, 24 September 2026 08:55:49 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

రేపు సిద్దిపేట జిల్లాలో మెగా ప్లాంటేషన్*

*ప్రతి గ్రామ పంచాయతీలో 1,000 మొక్కలు నాటాలి: జిల్లా కలెక్టర్ కే. హైమావతి

Date : 24 August 2026 07:11 PM Views : 58

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : జిల్లావ్యాప్తంగా ఈనెల 25వ తేదీ మంగళవారం అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతి గ్రామ పంచాయతీలో 1,000 మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొక్కలు నాటేందుకు ఇది అనుకూల సమయమని పేర్కొన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 17.68 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు లక్షలకు పైగా మొక్కలు నాటేందుకు గుంతలు సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన గుంతలను కూడా త్వరగా తవ్వి మొక్కలు నాటి జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు.గ్రామ పంచాయతీలతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో నిర్దేశిత లక్ష్యాల మేరకు మొక్కలు నాటాలని, ప్రభుత్వ విద్యా సంస్థలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఇరిగేషన్ శాఖకు చెందిన ఖాళీ స్థలాల్లోనూ విస్తృతంగా మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేస్తూ శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమల వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్నందున అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 780 మంది టీబీ బాధితులు క్రమం తప్పకుండా మందులు వినియోగిస్తున్నారా లేదా అనే అంశంపై వైద్య శాఖ అధికారులతో సమీక్షించాలని ఆదేశించారు.సెన్సెస్-2027కు సంబంధించి వివిధ శాఖలకు ప్రొఫార్మాలు అందించినట్లు తెలిపారు. ఆయా ప్రొఫార్మాల ప్రకారం అవసరమైన వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్ఓ నాగరాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంపై తగిన ఆదేశాలు జారీ చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :