Sunday, 08 November 2026 02:38:21 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరాహి బాంకెట్ హాల్ ప్రారంభోత్సవం

విజయవంతం కావాలని ఆదిత్యరెడ్డి ఆకాంక్ష

Date : 05 October 2026 02:14 PM Views : 116

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరులోని మకుట అరుణ ఆర్కేడ్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వరాహి బాంకెట్ హాల్ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తులో అత్యాధునిక హంగులతో, విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ పూర్తి ఏసీ బాంకెట్ హాల్ ప్రారంభ వేడుకకు తెలంగాణ యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బాంకెట్ హాల్ నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు వేడుకలు, వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు వరాహి బాంకెట్ హాల్ చక్కని వేదికగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఆధునిక సౌకర్యాలు, విశాలమైన ప్రాంగణం, పూర్తి ఏసీ వసతితో అందుబాటులోకి వచ్చిన ఈ హాల్ పటాన్‌చెరు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇలాంటి ఆధునిక వసతులతో కూడిన వేడుకల ప్రాంగణాలు అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. వరాహి బాంకెట్ హాల్ ప్రజాదరణ పొందుతూ, నిర్వాహకులకు మంచి పేరు తీసుకురావాలని, వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆదిత్యరెడ్డి ఆకాంక్షించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :