ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : కొండాపూర్ మండల పరిధిలోని గారకుర్తి గ్రామంలో గురువారం దూడలకు ఉచితంగా నులిపురుగుల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవంబర్ 2 నుంచి 7వ తేదీ వరకు పశువైద్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని దూడలకు నులిపురుగుల నివారణ మందులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పశువైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ) వసంతకుమారి కార్యక్రమానికి హాజరై మందుల పంపిణీని పర్యవేక్షించారు. దూడల ఆరోగ్య పరిరక్షణ, పశువుల ఎదుగుదలలో నులిపురుగుల నివారణ కీలకమని ఈ కార్యక్రమం ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యశాఖ సిబ్బంది, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు