Friday, 25 September 2026 05:29:05 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని అన్ని పంపులు వెంటనే ఆన్ చేయాలి

24 గంటల పాటు నిరంతరాయంగా నీటిని విడుదల చేయాలి..ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకుల డిమాండ్

Date : 11 September 2026 02:34 PM Views : 39

ప్రజా పిలుపు / తెలంగాణ / మహబూబ్ నగర్ : నాగర్‌కర్నూల్ జిల్లా, సెప్టెంబర్ 11: కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని అన్ని పంపులను వెంటనే ఆన్ చేసి, 24 గంటల పాటు నిరంతరాయంగా నీటిని విడుదల చేయాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని వారు కోరారు.మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మూడో దశ పంప్‌హౌస్‌తో పాటు గుడిపల్లి రిజర్వాయర్‌ను మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కురువ విజయ్‌కుమార్, జిల్లా రైతులు, బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా పంప్‌హౌస్, రిజర్వాయర్‌లోని నీటి పరిస్థితిని పరిశీలించి రైతుల సాగునీటి సమస్యలపై చర్చించారు.కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఐదు పంపులను పూర్తి సామర్థ్యంతో నడిపించి 24 గంటల పాటు నిరంతరాయంగా నీటిని విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం సాగు పనులు ఊపందుకుంటున్న నేపథ్యంలో రిజర్వాయర్లలో తగినంత నీటిని నిల్వ చేయడం అత్యవసరమని పేర్కొన్నారు.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా అన్ని రిజర్వాయర్లను నీటితో నింపాలని వారు కోరారు. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని, నీటి విడుదలలో ఎలాంటి జాప్యం చేయకూడదని స్పష్టం చేశారు.కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిపై ఆధారపడుతున్న వేలాది మంది రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని తక్షణమే అన్ని పంపులను ప్రారంభించి నిరంతరాయంగా నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :