ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బచ్చుగూడెం కాంగ్రెస్ కౌన్సిలర్ సరిత భుజంగారెడ్డి జన్మదినం సందర్భంగా ముత్తంగి డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాపురం నర్సింహారెడ్డి ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో చిరకాలం ఉండాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని సరిత భుజంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
Admin
ప్రజా పిలుపు