ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చేరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చేరు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా, మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు తడిసి వాహనాల రాకపోకలపై వర్షం ప్రభావం కనిపిస్తోంది. వర్షంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలకు ఎండ వేడి నుంచి కొంత ఉపశమనం లభించింది.పట్టణంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, వర్షపు జల్లులు కురుస్తుండటంతో రహదారులపై రాకపోకలు సాగించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
Admin
ప్రజా పిలుపు