ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : శివంపేట, అక్టోబర్ 21(ప్రజా పిలుపు ):శివంపేట మండలం దొంతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు.నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం దిశగా జరుగుతున్న చేరికల్లో భాగంగా ఈ చేరిక జరిగింది. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు