Thursday, 24 September 2026 08:05:26 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి

నిమజ్జన ప్రాంతాల్లో రక్షణ సిబ్బంది, ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలి

Date : 22 September 2026 06:39 PM Views : 20

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : *ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జనం నిర్వహించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్* * హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్టపై సెప్టెంబర్ 23న నిర్వహించనున్న గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నిమజ్జన ప్రాంతాల్లో భద్రత, లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీటి వసతి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదకర పరిస్థితులు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని, ఈతగాళ్లు, రక్షణ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.రాత్రివేళల్లో కూడా నిమజ్జన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నందున తగినంత లైటింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలను పాటిస్తూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.సెప్టెంబర్ 23న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవాల ఆధ్వర్యంలో నిర్వహించే నిమజ్జనంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.నిమజ్జన ఏర్పాట్లపై నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి శాంతిభద్రతలు, పోలీస్ బందోబస్తు, నీటి లభ్యత, పారిశుద్ధ్యం, రక్షణ చర్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో జరిగే గణేశ్ నిమజ్జన కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందన్నారు.రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ గణేశ్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు.గత నెలలో జరిగిన బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కూడా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారని, అదే ఆకాంక్షతో గణేశ్ ఉత్సవాల సందర్భంగా ప్రజలు ప్రార్థిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.ప్రజలందరూ భక్తిపారవశ్యంతో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గణేశ్ నిమజ్జన వేడుకలను విజయవంతంగా నిర్వహించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువుకు కాకతీయుల కాలం నాటి చారిత్రక ప్రాధాన్యత ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎల్లమ్మ చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తాను ఎన్నికైన అనంతరం అభివృద్ధి పనులను ప్రారంభించామని చెప్పారు.ఇప్పటికే ప్రారంభించిన అనేక అభివృద్ధి పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, త్వరలోనే గౌరవ రాష్ట్ర పెద్దలను తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిగిలిన చిన్నచిన్న పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు.ఎల్లమ్మ చెరువు కట్టపై జరుగుతున్న సుందరీకరణ పనులతో పాటు చెరువులో ఏర్పాటు చేస్తున్న గ్లాస్ బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు.ఎల్లమ్మ చెరువు ప్రాంతానికి ప్రజలు, పర్యాటకులు సులభంగా చేరుకునేలా రహదారి సౌకర్యాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. పల్లె చెరువు నుంచి ఎల్లమ్మ చెరువు వరకు రహదారి అభివృద్ధితో పాటు అవసరమైన ప్రాంతాల్లో నాలుగు లైన్ల రహదారి అభివృద్ధికి అనుమతులు తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అనబేరి స్టాచ్యూ నుంచి నాగన్నమ్మ దారి వరకు రహదారి అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హుస్నాబాద్ పట్టణంలోని పోచమ్మ గుడి, ఎల్లమ్మ గుడి ప్రాంతాలను కూడా మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.హుస్నాబాద్ పట్టణంలో ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కూరగాయల మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్, చిల్డ్రన్స్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్, అర్బన్ పార్క్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి తెలిపారు.కొత్త చెరువు, పల్లె చెరువు అభివృద్ధితో పాటు పట్టణ ప్రజల శాశ్వత తాగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, పర్యాటక అభివృద్ధి, శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు.బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో 1.19 లక్షల కుట్టు మిషన్లను 100 శాతం సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. అర్హత కలిగిన మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు.ఎంపిక ప్రక్రియలో అర్హతతో పాటు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు కుట్టు మిషన్లు ఉపయోగపడతాయని తెలిపారు.బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా ఆయా వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఎంపిక, మంజూరు ప్రక్రియలను కూడా వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.సంక్షేమంతో పాటు విద్య, ఉపాధి, వ్యవసాయం, మౌలిక వసతులు, అభివృద్ధి వంటి అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :