Thursday, 24 September 2026 12:10:28 PM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

బీరంగూడ ఆలయ అభివృద్ధికి అధికారుల స్థల పరిశీలన

Date : 22 August 2026 04:08 PM Views : 50

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బీరంగూడ గుట్టపై కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు శనివారం స్థల పరిశీలన చేపట్టారు. దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ శర్మ, అసిస్టెంట్ ఇంజనీర్ తులసీరామ్, అసిస్టెంట్ స్థపతి వెంకటేశ్వరరావు ఆలయాన్ని సందర్శించారు.ఆలయ కార్యనిర్వహణ అధికారి దేవనాదం, చైర్మన్ సుధాకర్ యాదవ్, పాలకమండలి సభ్యులతో కలిసి ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు అవసరమైన స్థలాలను గుర్తించారు. ముఖ్యంగా శివాలయ విగ్రహం ఏర్పాటు, 16 వసతి గృహాలు, హోమశాల, వేద పాఠశాల, సౌర విద్యుత్‌ వ్యవస్థ తదితర సౌకర్యాల ఏర్పాటుపై చర్చించారు.ఆలయ భవిష్యత్ అవసరాలు, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలు, అంచనాలు, కొటేషన్లు సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :