Thursday, 24 September 2026 08:06:00 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

ఈసీఈలో కల్లకుంట సునీలకు పీహెచ్.డీ.

Date : 22 September 2026 03:39 PM Views : 18

ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) పరిశోధక విద్యార్థిని కల్లకుంట సునీల డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘సెంట్రాలిటీ కొలతలపై దృష్టి సారించి, గ్రాఫ్ థియరీ టెక్నిక్ లను ఉపయోగించి కీలక నోడ్ గుర్తింపు ద్వారా వైర్ లెస్ సెన్సార్ నెట్ వర్కుల ఆప్టిమైజేషన్’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఈఈసీఈ విభాగం అధ్యాపకుడు డాక్టర్ ఎ.శ్రీనివాస్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అంతర్ విభాగ పరిశోధన, వైర్ లెస్ సెన్సార్ నెట్ వర్కుల శక్తి సామర్థ్యం, విశ్వసనీయత, స్థితిస్థాపకత, డేటా ప్రసార సామర్థ్యాలను మెరుగుపరచడానికి గ్రాఫ్ థియరీ, గణాంకాలు, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లను ఏకీకృతం చేస్తుందని వివరించారు. ఈ పరిశోధనకు పర్యావరణ పర్యవేక్షణ, ప్రెసిషన్ అగ్రికల్చర్, పారిశ్రామిక ఆటో మేషన్, ఆరోగ్య సంరక్షణ, విపత్తు నిర్వహణ, రక్షణ నిఘా వంటి రంగాలలో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయన్నారు.తన డాక్టరేట్ ప్రస్థానంలో, డాక్టర్ సునీల పది పరిశోధనా పత్రాలను ప్రచురించడమే గాక, ఐఐటీ హైదరాబాదు, బిట్స్ పిలానీ, హైదరాబాదు ప్రాంగణాలలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులలో తన పరిశోధనను సమర్పించారు.డాక్టర్ సునీల సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం నాయకత్వంతో పాటు, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందనలు తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె పరిశోధన, వృత్తిపరమైన ప్రయత్నాలలో నిరంతర విజయం సాధించాలని వారు ఆకాంక్షించినట్టు తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :