Thursday, 24 September 2026 11:43:52 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

మరోసారి మానవత్వం చాటుకున్న ఎండీఆర్ ఫౌండేషన్

అనాధ వృద్ధురాలికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించిన ఎండీఆర్ ఫౌండేషన్

Date : 21 July 2026 06:52 PM Views : 94

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : మానవత్వమే మహోన్నతమైన సేవ అనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ మరోసారి తన మానవతా విలువలను చాటుకుంది.రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి సమీపంలో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న సుమారు 50–60 సంవత్సరాల వయస్సు గల ఓ అనాధ వృద్ధురాలు రోడ్డుపై మృతదేహంగా కనిపించడంతో స్థానికులు వెంటనేపోలీసులకుసమాచారంఅందించారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలి వివరాలు, బంధువుల ఆచూకీ కోసం అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు.అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని స్వీకరించిన ఎండీఆర్ ఫౌండేషన్ సభ్యులు, ఆమెకు పూర్తి గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహించారు.జన్మనిచ్చిన వారు లేకపోయినా, చివరి ప్రయాణంలో అనాధలు ఒంటరిగా ఉండకూడదనే మానవతా దృక్పథంతో ఎండీఆర్ ఫౌండేషన్ ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోంది.సమాజంలో నిరాశ్రయులు, అనాధలకు చివరి వీడ్కోలు పలకడం కూడా తమ సామాజిక బాధ్యతగా భావిస్తూ సేవలు అందిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :