ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం క్యూలైన్లు, తాగునీటి సౌకర్యం, అన్నసంతర్పణ, పార్కింగ్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా దేవస్థానంలో ఎస్‌ఎస్ క్యూ లైన్ ఏర్పాటు కోసం దాత చుండూరు నాగసాయి ప్రవీణ్ కుమార్, ధర్మపత్ని ఇందిరా ప్రియదర్శిని, అరవింద్ ఫార్మర్స్ కంపెనీ తరఫున రూ.3,80,516/- విరాళాన్ని అందించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును దేవస్థానానికి అందజేశారు.వినాయక చవితి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దాతలు ముందుకు రావడం పట్ల దేవస్థానం నిర్వాహకులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. దాతలకు దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Admin
ప్రజా పిలుపు