Thursday, 24 September 2026 08:05:30 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సిద్దిపేట జిల్లా జట్టు సిద్ధం.కబడ్డీ క్రీడాకారులకు జెర్సీలు అందజేసి అభినందించిన మంత్రి

Date : 22 September 2026 06:41 PM Views : 19

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : * హుస్నాబాద్‌లో గత పది రోజులుగా శిక్షణ పొందుతున్న సిద్దిపేట జిల్లా కబడ్డీ జట్టును రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం అభినందించారు.ఈ నెల 26వ తేదీ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు సిద్దిపేట జిల్లా కబడ్డీ జట్టు హుస్నాబాద్‌లో గత పది రోజులుగా ప్రత్యేక శిక్షణ పొందుతోంది.రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి, వారికి జట్టు జెర్సీలను అందజేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి సిద్దిపేట జిల్లాకు, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు కూడా యువత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను త్వరగా సాధించేందుకు క్రీడా ప్రతిభ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని మంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు.సిద్దిపేట జిల్లా జట్టు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :