Monday, 10 August 2026 11:20:45 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

*నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో పర్యటించిన మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్*

Date : 27 June 2026 04:37 PM Views : 33

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజా పిలుపు జూన్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని నందన్ రతన్ ప్రైడ్ కాలనీ వాసుల ఆహ్వానం మేరకు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కాలనీలో పర్యటించారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గతంలో స్వల్ప వర్షానికే కాలనీ మొత్తం నీట మునిగిపోయేదని తెలిపారు. అయితే మెట్టు కుమార్ యాదవ్ చొరవతో ప్రత్యేక నిధుల ద్వారా వర్షపు నీటి కాలువలు నిర్మించడంతో ప్రస్తుతం వర్షపు నీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటకు వెళ్లిపోతోందని పేర్కొన్నారు.అనంతరం కాలనీలో 11 అంతర్గత రహదారులు ఇప్పటికీ నిర్మించలేదని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మెట్టు కుమార్ యాదవ్ సంబంధిత ఇంజినీర్‌తో ఫోన్‌లో మాట్లాడి అన్ని రహదారులకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. కాలనీలో తాగునీటి సమస్య ఉందని స్థానికులు వివరించగా, వెంటనే సంబంధిత అధికారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా గృహ గణన దరఖాస్తు పత్రాలు ప్రతి ఇంటికి చేరేలా సంబంధిత బూత్ స్థాయి అధికారికి సూచనలు చేశారు. ప్రతి కుటుంబం సహకరించి దరఖాస్తు పత్రాలను పూర్తిగా నింపి అందించాలని కాలనీ వాసులకు విజ్ఞప్తి చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :