ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు పటాన్చెరు పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ,జూన్ 30న మాజీ మంత్రి హరీష్ రావు పటాన్చెరులో నిర్వహించనున్న సంస్మరణ సభ నేపథ్యంలో పాశమైలారంలో సభ పోస్టర్‌ను పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఘటన జరిగి ఏడాది పూర్తయినా ప్రభుత్వం ప్రకటించిన రూ.1 కోటి నష్టపరిహారం బాధిత కుటుంబాలకు పూర్తిగా అందలేదని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించడంతో పాటు ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జూన్ 30న మాజీ మంత్రి హరీష్ రావు బాధిత కుటుంబాలను పరామర్శించి సంస్మరణ సభలో పాల్గొంటారని తెలిపారు. బాధిత కుటుంబాలు, కార్మికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్వీ నాయకుడు మేరాజ్ ఖాన్, కౌన్సిలర్లు మచ్చ కిషోర్ రెడ్డి, బూరిగారి నరేందర్ రెడ్డి, వడ్డెగడ్డ రాజు, గొంగోళ్ల నవీన్ రెడ్డి, పెలిమెల వెంకటేష్, కో-ఆప్షన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, బండ రాజు, ఐలాపూర్ మాణిక్ యాదవ్, పాశంమైలారం గ్రామ అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు