Monday, 09 November 2026 02:59:40 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

*ఆరు గ్యారంటీలు.. 420 హామీలు అమలు చేయాలి*

అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణుల వినతిపత్రం*

Date : 08 September 2026 05:44 PM Views : 60

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి పట్టణంలో భారీ నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూచనలతో పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వినతిపత్రం సమర్పించారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. హామీల అమలుపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం, పోలీసు అధికారులు వ్యవహరించిన తీరును బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వచ్చిన ప్రజాప్రతినిధులను నిర్బంధించడం, అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉందని, ఆ హక్కులను అణచివేయడం సరికాదని పేర్కొన్నారు.మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీర్నపల్లి శంకర్, వేముల వీరేశం చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వ్యాఖ్యలను ఖండిస్తూ సంబంధిత ఎమ్మెల్యేలపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శించారు.అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. “ఆరు గ్యారంటీలు అమలు చేయాలి.. 420 హామీలు నెరవేర్చాలి”, “కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు.చింతా సాయినాథ్, మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల పక్షాన ప్రశ్నించినందుకు అరెస్టులు చేసినంత మాత్రాన ఉద్యమాలను అణచివేయలేరని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, హకీమ్, విజేందర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, చింతా సాయినాథ్, మందుల వరలక్ష్మి, డాక్టర్ శ్రీహరి, నాగరాజు గౌడ్, యువజన నాయకులు శ్రవణ్ రెడ్డి, వాజిత్, వేణుగోపాలస్వామితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :