ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి చికిత్స కోసం తీసుకొచ్చిన ఓ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ఈ ఘటన కలకలం రేపింది.చెర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీని మానసిక చికిత్స కోసం ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చికిత్స ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.ఖైదీ పరారైన విషయాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారైన ఖైదీ ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Admin
ప్రజా పిలుపు