ప్రజా పిలుపు / తెలంగాణ / హైదరాబాదు : నగరవాసుల రోజువారి వ్యక్తిగత పనులను సులభతరం చేసే లక్ష్యంతో హైదరాబాద్‌కు చెందిన ఒక కొత్త సంస్థ వినూత్న సేవలను ప్రారంభించింది. ఆహారం, కిరాణా సరుకుల పంపిణీకే పరిమితం కాకుండా, ప్రజల తరఫున వివిధ వ్యక్తిగత పనులను పూర్తి చేసే సౌకర్యాన్ని అందిస్తూ తొలి వారంలోనే విశేష ఆదరణ పొందినట్లు సంస్థ తెలిపింది.అవసరమైన సమయంలో ఒక సహాయకుడిని బుక్ చేసుకుని, ఒకే బుకింగ్‌తో అనేక వ్యక్తిగత పనులను పూర్తి చేయించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రారంభమైన తొలి వారంలోనే 200కు పైగా పనులను విజయవంతంగా పూర్తి చేసినట్లు, వెయ్యికి పైగా వినియోగదారులు, నాలుగు వేల మందికి పైగా సహాయకులు నమోదు చేసుకున్నట్లు వెల్లడించింది.బ్యాంకుల్లో క్యూలో నిలబడటం, పత్రాలు సమర్పించడం, ఇంటిని పరిశీలించడం, మార్కెట్‌లో వస్తువులు కొనుగోలు చేయడం, మరిచిపోయిన వస్తువులను తీసుకురావడం వంటి అనేక పనులను ఈ సేవ ద్వారా పూర్తి చేయించుకోవచ్చని తెలిపింది.ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. సేవల పురోగతిని ప్రత్యక్షంగా తెలుసుకునే సౌకర్యం, పారదర్శక ధరల విధానం, ధృవీకరించిన సహాయకులను అందుబాటులో ఉంచినట్లు సంస్థ వెల్లడించింది.సంస్థ వ్యవస్థాపకులు హర్ష, సూర్య మాట్లాడుతూ, ప్రతి సందర్భంలో వస్తువుల పంపిణీ అవసరం ఉండదని, చాలా సందర్భాల్లో ప్రజల తరఫున పనిని పూర్తి చేసే నమ్మకమైన వ్యక్తి అవసరం ఉంటుందని చెప్పారు. అలాంటి అవసరాలను తీర్చడంతో పాటు ప్రజల సమయాన్ని ఆదా చేయడం, స్థానికంగా వేలాది మందికి అదనపు ఉపాధి అవకాశాలు కల్పించడమేతమలక్ష్యమనిపేర్కొన్నారు.హైదరాబాద్‌లో మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో త్వరలోనే తెలంగాణలోని ఇతర నగరాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాలకు కూడా సేవలను విస్తరించేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించింది.
Admin
ప్రజా పిలుపు