Friday, 25 September 2026 10:02:27 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సన్న బియ్యం సాగు పై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్

Date : 03 July 2026 09:41 PM Views : 74

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని,రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సన్నబియ్యం సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ,జిల్లాలో 36 శాతం అదనంగా వరిధాన్యం ప్రొక్యూర్మెంట్ పూర్తవడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని,రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఎవరూ వ్యవహరించరాదని స్పష్టం చేశారు.జిల్లాలో ఇప్పటివరకు 6,351 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం మాత్రమే కొనుగోలు జరిగిందని పేర్కొంటూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సన్నబియ్యం సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని,రైతులకు అవసరమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు. వ్యవసాయ అవసరాలకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని,వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పెంకుటిళ్లు లేకుండా పక్కా ఇళ్లు ఉండేలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ,జిల్లాలోని అన్ని పెంకుటిళ్లను గుర్తించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అధికారులు మంచి పురోగతి సాధిస్తున్నారని అభినందిస్తూ,పేదల సొంతింటి కలను సాకారం చేసేలా మరింత కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని,అసంపూర్తి మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బస్తీ దవాఖానల్లో వైద్యుల కొరత ఉంటే వెంటనే నియామక ప్రక్రియ చేపట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని,ఆసుపత్రుల్లో మౌలిక వసతులు,వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని మంత్రి ఆదేశించారు. చిన్నచిన్న మరమ్మతు పనులను కూడా ప్రాధాన్యతతో పూర్తి చేయాలని సూచించారు.టామ్ కామ్ సంస్థ ద్వారా నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగాలు కల్పించేందుకు ఆయా దేశాల స్థానిక భాషలపై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లాలో యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేలా జిల్లాలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు మాట్లాడుతూ జిల్లాలో 5.17 లక్షల ఎకరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని,డ్రోన్ల ద్వారా ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు.నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన భూసమస్యలను పరిష్కరించాలని,మర్కుక్–పాములపర్తి రహదారిపై డివైడర్ లైట్లు ఏర్పాటు చేయాలని, మల్లన్నసాగర్ నిర్వాసితులకు పెండింగ్ పరిహారం త్వరగా అందించాలని కోరారు. సోలార్ పంప్‌సెట్ల ఏర్పాటు,కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించబడేలా చర్యలు తీసుకోవాలని, దుబ్బాకలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. నామాపూర్ గ్రామంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కార్యక్రమం ద్వారా ఇండ్లపై సోలార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ జిల్లాలో యూరియా సరఫరా సమృద్ధిగా ఉందని జిల్లాకు 45 వేల మెటీరియల్ ఏరియా అవసరం కాగా ఇప్పటికే జిల్లాలో 10,000 మెట్రిక్ టన్నుల ఏరియా స్టాక్ ఉందని తెలిపారు.అక్రమాలకు పాల్పడిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని,యూరియా యాప్ ద్వారా ప్రతి రైతుకు అవసరమైన యూరియా అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పంటల నష్టం నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,టూ బీహెచ్‌కే ఇళ్ల పెండింగ్ పనులను వేగవంతం చేసి,అనర్హులను తొలగించి అర్హులకు ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు.సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ,రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు,యూరియా సకాలంలో అందేలా చూడాలని కోరారు.వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, జనుము,జిలుగు విత్తనాల కొరత లేకుండా చూడాలని సూచించారు.వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల పెండింగ్ తొలగించాలని,సీజనల్ వ్యాధులపై ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.జిల్లాలో సి-సెక్షన్‌ల సంఖ్య తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని,నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని, బస్తీ దవాఖానల్లో వైద్యులను నియమించాలని,పశువులకు అవసరమైన మందులు సకాలంలో అందించాలని, సిద్దిపేట సిరిసిల్ల వెళ్లే రైల్వే లైన్ మధ్యలో గల మూడు కెనాల్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య మాట్లాడుతూ వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ పథకాన్ని ఉపయోగించాలని,డిఇఓ ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలని అన్నారు.దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ,సన్నబియ్యం సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, భూసార పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కెనాల్ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు,వైర్ల సమస్యలను పరిష్కరించి,అసంపూర్తి రహదారి పనులను పూర్తి చేయాలని కోరారు.ఎంఎల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ, రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీని వేగవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టాలని,జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటు విస్తరించాలని సూచించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు వంటేరు ప్రతాపరెడ్డి, దేశిపతి శ్రీనివాస్,మల్క కొమరయ్య,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :