Friday, 25 September 2026 02:23:42 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

900 గజాల గ్రామకంఠo భూమినీ కాపాడాలి

నకిలీ ఆధారాలు చూపెడుతూ రిజిస్ట్రేషన్ చేయిస్తున్న వారిపై చర్య తీసుకోవాలి

Date : 26 June 2026 05:54 PM Views : 130

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : చేసిన రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలి: ప్రజావాణిలో గ్రామస్తుల ఫిర్యాదు సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని మంగంపేట గ్రామంలో సుమారు రూ.50 లక్షల విలువైన భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని ఆరోపిస్తూ, వెంటనే ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని గ్రామస్తులు ప్రజావాణిలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రూపేరేవు లక్ష్మణరావు, పాలపు లక్ష్మణ్ మాట్లాడుతూ, గ్రామంలో ఉన్న గ్రామకంఠం భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది గ్రామస్తులు, రాజకీయ నాయకుల సహకారంతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు.ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌కు దర్యాప్తు కోసం పత్రాలు పంపినప్పటికీ, ఇప్పటి వరకు భూమిని సర్వే చేయించకపోవడం ఆశ్చర్యకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా, ఈ భూమి ఎమ్మార్వో కార్యాలయానికి సమీపంలో ఉండటంతో భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు, గ్రామ ప్రజల ప్రయోజనాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అందువల్ల అక్రమ రిజిస్ట్రేషన్‌ను వెంటనే రద్దు చేసి, భూమిని సర్వే నిర్వహించి ప్రభుత్వ ఆధీనంలో భద్రపరచాలని జిల్లా అధికారులను కోరారు. *

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :