ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఆల్విన్ కాలనీ: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీకి చెందిన సెంట్రింగ్ మేస్త్రి మనోజ్ (38) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు.ఈ సందర్భంగా డి.వి.జి ట్రస్ట్ ద్వారా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని వెంకటేష్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అగ్రవాసు, రాజుగౌడ్, కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు