Monday, 09 November 2026 02:41:57 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు

షోలాపూర్‌లో ఇద్దరు చిన్నారుల జాడ.. తల్లిదండ్రులకు అప్పగింత

Date : 06 November 2026 06:47 PM Views : 20

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చేరు, :తప్పిపోయిన ఇద్దరు బాలుర ఆచూకీని పటాన్‌చేరు పోలీసులు 12 గంటల్లోనే గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామానికి చెందిన ఎముల సాయిచరణ్‌ కుమారులు హర్ష (13), దక్ష్‌ (11) ఈ నెల 5న సాయంత్రం 4 గంటల సమయంలో పటాన్‌చేరు శ్రీ వెంకటేశ్వర కాలనీలోని నానమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పటాన్‌చేరు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్‌ ఎం. రవీందర్‌ పర్యవేక్షణలో ఎస్‌ఐ తాండర్‌పల్లి వినోద్‌ దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు కొనసాగించి మహారాష్ట్రలోని షోలాపూర్‌లో బాలురను గుర్తించారు. కేసు నమోదైన 12 గంటల్లోనే వారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. సత్వరమే స్పందించి తమ పిల్లలను అప్పగించిన పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :