Friday, 25 September 2026 05:29:28 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతతో రుణాలు మంజూరు చేయాలి

ప్రత్యేక రుణమేళాలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కె. హైమావతి

Date : 18 September 2026 07:07 PM Views : 23

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : ప్రాధాన్యత రంగాలతో పాటు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి బ్యాంకు అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి కన్సల్టేటివ్ కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాల సాధనలో పురోగతి బాగానే ఉందని, అయితే వ్యవసాయ రంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే రైతుల కోసం ప్రత్యేక రుణమేళాలు ఏర్పాటు చేసి రుణాలు అందించాలని సూచించారు. వివిధ శాఖల ద్వారా గ్రౌండింగ్ కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరిశ్రమలు, ఉపాధి కల్పన శాఖలు, బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రబీ సీజన్‌లో రుణాల కోసం వచ్చే రైతులకు అవసరమైన సహకారం అందించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు.ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై వెంటనే స్పందించి అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే పరిస్థితి ఉంటే, అర్హులైన లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించాలని అన్నారు.ప్రాధాన్యత, వ్యవసాయ రంగాల్లో పనితీరు తక్కువగా ఉన్న బ్యాంకులు ప్రత్యేక రుణమేళాలు నిర్వహించి సెప్టెంబర్‌లోగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఆదేశించారు. తదుపరి సమావేశం నాటికి లక్ష్యాలను పూర్తి చేసిన ఉత్తమ పనితీరు కనబరిచిన ముగ్గురు బ్యాంకు అధికారులను సత్కరించాలని సూచించారు.మహిళా సంఘాలకు నిర్దేశించిన మేరకు రుణాలు మంజూరు చేసి లక్ష్యాలను సాధించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. చీకోడ్, జగదేవపూర్, కోహెడ ఎస్‌బీఐ శాఖల బదిలీతో పాటు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని చెప్యాల, ఎల్లారెడ్డిపేట, కొండపోచమ్మ దేవాలయం రెవెన్యూ గ్రామాల్లో నూతన బ్యాంకు శాఖల ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనలకు జిల్లా స్థాయి కమిటీ (డీఎల్‌సీ) ఆమోదం తెలిపింది.ఈ సమావేశంలో ఎల్‌డీఎం హరిబాబు, డీఆర్‌డీఓ రమేష్, ఆర్‌బీఐ ఎల్‌డీఓ వెన్న శ్రీనివాస్, ఎస్‌బీఐ ఆర్‌ఎం మారుతి, టీజీబీ ఆర్‌ఎం రాజయ్య, ఏండీసీసీబీ జీఎం శ్రీనివాస్, ఆర్‌ శెట్టి డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :