ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 21 ఏళ్ల యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బోయిని మౌనిక అనే యువతి అక్టోబర్ 31వ తేదీన స్నానం చేసి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంతసేపటికీ ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.గతంలో వరప్రసాద్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు మౌనిక తనతో చెప్పిందని, ఈ నేపథ్యంలో అతడిపై అనుమానం ఉందని యువతి తండ్రి బోయిని తుకారాం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమార్తె ఆచూకీ కనుగొని, అదృశ్యానికి గల కారణాలను వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువతి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.
Admin
ప్రజా పిలుపు