ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : రాఖీ పౌర్ణమి సందర్భంగా భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి మాజీ మంత్రి, శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ హరీష్ రావు నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు.రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హరీష్ రావుకు రాఖీ కట్టిన సింధు ఆదర్శ్ రెడ్డి, అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా హరీష్ రావు సింధు ఆదర్శ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
ప్రజా పిలుపు