Wednesday, 11 November 2026 04:41:41 PM
# నేడు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం # శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. # నవంబర్ 15న పటాన్‌చెరు సాకి చెరువు వేదికగా ఛట్ పూజ వేడుకలు..ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు.. # ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి # ఇస్నాపూర్ నూతన సీఐ టి. మహేష్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నిజాముద్దీన్ బాబా # బీరంగూడ కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన బస్సు # యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.50 లక్షల విరాళం..దాతలు ముందుకు రావడం సంతోషం: డిజిపి సి. వి. ఆనంద్ # పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి # యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న* # భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు # సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం.. రైతుల్లో భయాందోళన # పేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60 వేల ఆర్థిక సహాయం # గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని బీజేపీ నాయకుల ధర్నా* # పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్

SIRకు ప్రతి ఓటరు సహకరించాలి

బలోపేతం చేస్తుందిఅర్హులందరూ తమ వివరాలను ధృవీకరించుకోవాలి– బీజేపీ 2వ వార్డు కౌన్సిలర్ చందా అశోక్ యాదవ్

Date : 03 July 2026 10:11 PM Views : 108

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమానికి ప్రతి ఓటరు సంపూర్ణ సహకారం అందించాలని తూప్రాన్ మున్సిపాలిటీ 2వ వార్డు బీజేపీ కౌన్సిలర్ చందా అశోక్ యాదవ్ పిలుపునిచ్చారు. ఓటరు జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించే ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు ఇంటింటి సర్వే నిర్వహించే అధికారులు, బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) అడిగే వివరాలను ప్రజలు సకాలంలో అందించి సహకరించాలని కోరారు.ఓటరు జాబితాలో పేరు లేని అర్హులు కొత్తగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే పేరు ఉన్న వారు తమ వ్యక్తిగత వివరాలు, చిరునామా, వయస్సు వంటి అంశాలను ఒకసారి పరిశీలించి అవసరమైతే సవరణలు చేసుకోవాలని సూచించారు. ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నట్లయితే వాటిని తొలగించే ప్రక్రియకు కూడా ప్రజలు సహకరించాలని తెలిపారు.ఓటరు జాబితా స్వచ్ఛంగా, ఖచ్చితంగా ఉండడం వల్ల ఎన్నికలు మరింత పారదర్శకంగా నిర్వహించే అవకాశం ఉంటుందని, అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి పౌరుడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేశారు.అలాగే ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత బూత్ లెవల్ అధికారులు లేదా ఎన్నికల అధికారులను సంప్రదించి సరైన సమాచారం తెలుసుకోవాలని, అపోహలు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల సహకారమే ప్రధానమని, ప్రతి ఓటరు తన ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చందా అశోక్ యాదవ్ కోరారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :